మునుగోడు బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబ స్వార్థం కోసం రాజగోపాల్ రెడ్డి 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి కూడా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అమ్ముడు పోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వుందా? అంటూ మంత్రి సూటిగా ప్రశ్నించారు. 20వేల కోట్ల కాంట్రాక్టు పొందిన అని బహిరంగంగా చెప్పిన రాజగోపాల్ రెడ్డి పెద్ద దొంగ అని జగదీష్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తామన్నారు. ఇలాంటి అమ్ముడు పోయిన రాజకీయాలు చేసి, త్యాగం చేశామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.