బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు పంపడంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. మోదీ (PM Modi) దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) కుట్రలో భాగమే కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత ధోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

 

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఆప్ ,ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టె కుట్రలో భాగగానే నోటీలు, అరెస్టులని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (mlc kavitha) ఈడీ నోటీసులిచ్చింది. గురువారం విచారణకు రావాలని ఆదేశించింది. హైదరాబాద్ వ్యాపారి రామచంద్ర పిళ్లైతో కలిసి, కవితను విచారించనున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా పేర్కొంటున్న హైదరాబాద్‌ మద్యం వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఆయన రిమాండ్‌ రిపోర్టులో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించింది.

 

తనకు ఈడీ నోటీసులు అందాయని, ఈడీకి పూర్తిగా సహకరిస్తానని కవిత (mlc kavitha) హామీ ఇచ్చారు. అయితే… ముందస్తు షెడ్యూల్ ప్రకారం కొన్ని అపాయింట్స్, కార్యక్రమాలు వున్నాయని, రేపటి విచారణకు హాజరు కావాలా లేక నోటీసులపై లేఖ రాయాలా అనేది న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మార్చి 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ లో మహిళా బిల్లు కోసం దీక్ష చేపట్టామని.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు.