హైదరాబాద్ లో వున్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా వెబ్సైట్, మొబైల్ యాప్ను అధికారులు రూపొందించారు. ఈ వెబ్ సైట్ ను అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. వెబ్సైట్లో సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్, బ్యాటరీ వెహికల్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్సైట్ను (https://nzptsfd.telangana.gov.in/home.do) రూపొందించింది. ఇకపై జూపార్క్ వచ్చి లైన్లో నిల్చునే అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే బుకింగ్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో చూడదగిన పర్యాటక ప్రదేశాల్లో నెహ్రూ జూపార్క్ ఒకటి. దేశంలోనే అతిపెద్ద జూపార్క్గా పేరు తెచ్చుకున్న నెహ్రూ జూ పార్క్అక్టోబరు 12, 1963 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ జంతు ప్రదర్శనశాలలో దాదాపు 1,500 జాతుల జంతువులు, పక్షులు ఆవాసం ఉంటున్నాయి.