తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల స్మృతిలో ప్రభుత్వం రూ.178 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా స్మారక కేంద్రాన్ని నిర్మించింది. ఈ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ తరహా నమూనాను కోరుకుంటున్నారని, ప్రజల ప్రయోజనాలను కాపాడుతోందని వివరించారు. సచివాలయ సమీపంలో సమున్నతంగా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని రూ. 147 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్నదని, సామాజిక న్యాయ స్ఫూర్తికి సమున్నత ప్రతీకగా నిర్మిస్తున్న అంబేద్కర్‌ మహానీయుని విగ్రహం యావద్దేశానిఇక గర్వకారణంగా నిలవబోతున్నదని వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి విగ్రహం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు
కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం రూ. 750 కోట్లు
సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం రూ. 725 కోట్లు
యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం రూ. 200 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 21,022 కోట్లు
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి రూ. 1500 కోట్లు
మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ. 200 కోట్లు
మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు

రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..
రుణ‌మాఫీ ప‌థ‌కానికి రూ. 6,385 కోట్లు..
రైతుబందు ప‌థ‌కానికి రూ. 1575 కోట్లు
రైతుబీమా ప‌థ‌కానికి రూ. 1589 కోట్లు

హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు
హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు
ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 4,037 కోట్లు
పుర‌పాల‌క శాఖ‌కు రూ. 11,372 కోట్లు
రోడ్లు భ‌వ‌నాల శాఖ‌కు రూ. 2,500 కోట్లు

ఆయిల్ పామ్‌కు అధిక ప్రాధాన్యం..
ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు రూ. 3,117 కోట్లు
ఆయిల్ ఫామ్‌కు రూ. 1000 కోట్లు
అట‌వీ శాఖ కోసం రూ. 1,471 కోట్లు
పంచాయ‌తీ రాజ్‌కు రూ. 31,426 కోట్లు
హ‌రిత‌హారం ప‌థ‌కానికి రూ. 1471 కోట్లు