తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్కసారిగా బాంబు పేల్చేశారు. ప్రజల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. ఈ 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మార్చితేనే… బీఆర్ఎస్ కి 100 సీట్లు గ్యారెంటీ అని, లేదంటే కష్టమేనంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ లో సంచలనం రేగింది.
పార్టీ మొత్తం ఖమ్మం సభ వైపు వుండగా… మంత్రి ఎర్రబెల్లి ఈ సంచలన వ్యాఖ్యలు దిగారు. తాను సొంతంగా సర్వే చేయించానని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని..అయితే 20 మంది సిట్టింగ్ లను మారిస్తే 100 సీట్లు ఖాయమని అన్నారు. ఆరేడు జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు.. మూడు నాలుగు జిల్లాలలో బీజేపీకి, బీఆర్ఎస్ కు మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. కొందరి ఎమ్మెల్యేలపై మాత్రం వ్యక్తిగతంగా వ్యతిరేకత వుందని, తన సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదన్నారు.