విశాఖ రాజధానిగా మారితే భవిష్యత్ బాగుంటుందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. దశాబ్దాల తర్వాత వచ్చిన అద్భుత అవకాశమని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరిగింది. ఇందులో ధర్మాన ప్రసాద రావు మాట్లాడారు. విశాఖ రాజధానిగా అవడానికి ఉద్యమం అవసరమని, ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దు అంటే ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు.
అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మొక్కుకుని వెళ్తే మాకు అభ్యంతరం లేదని, ఈ గడ్డ మీదికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విశాఖ రాజధాని కావాలని, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకైనా సిద్ధమేనని ధర్మాన సంచలన ప్రకటన చేశారు.