వికేంద్రీకరణ మా విధానం.. మరో సారి స్పష్టం చేసిన మంత్రి బొత్స

మూడు రాజధానులపై వైసీపీ సర్కార్ మరోసారి స్పష్టతనిచ్చింది. తమ విధానం వికేంద్రీకరణమే అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాలు పెట్టామని, ఒక ప్రాంతం, ఒక వర్గం కోసం తాము ఆలోచించడం లేదన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకే తాము కట్టుబడి వున్నామని పేర్కొన్నారు. కాకినాడలో వికేంద్రీకరణపై జరిగిన మేధావుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. రాజధాని ప్రతిపాదనపై లోతైన అధ్యయనం చేశామని, అభివృద్ధి అంతా ఒకే చోట జరగడం కాకూడదని అన్నారు. ప్రభుత్వానికి అన్ని జిల్లాలూ సమానమేనని స్పష్టం చేశారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్యలు తేవడం సరికాదని మంత్రి బొత్స పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates