అనసూయ…. అటు యాంకరింగ్ రంగంలో, ఇటు… సినిమా రంగంలో కూడా రాణిస్తున్నారు. ఓ వైపు యాంకర్ గా చేస్తూనే.. మరోవైపు సినిమా రంగంలోనూ మెరుస్తున్నారు. రంగస్థలం, పుష్ప సినిమాల్లో నటించి, మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు తాజాగా… ఓ పాన్ ఇండియా సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా మైఖేల్ అనే చిత్రం రూపొందుతోంది. విజయ్ సేతుపతితో అనసూయ కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. మ్యాడ్ ఆఫ్ క్వీన్ అంటూ పవర్ ఫుల్ గెటప్ లో అనసూయ కనిపిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఇటీవలే మైఖేల్ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో మైఖేల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఖేల్‌లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మైఖేల్‌లో దివ్యాంక కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.