తారకరత్నపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తారకరత్న కోలుకుంటున్నారని తెలిసిన చాలా సంతోషం అనిపించిందన్నారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకొని, ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఈ పరిస్థితి నుంచి తారకరత్నను కాపాడిన డాక్టర్లకు, భగవంతుడికి ధన్యవాదాలు అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తారకరత్న నిండు నూరేళ్లూ.. ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.

మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదని, వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే వుందన్నారు. అయితే.. ఆయనకు ఇప్పటి వరకూ ఎక్మోపై ఎలాంటి చికిత్స అందించలేదని స్పష్ట చేశారు.

Related Posts

Latest News Updates