మెగాస్టార్ చిరంజీవి ‘మెగా154’ టైటిల్ టీజర్ దీపావళికి విడుదల, డబ్బింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154.  ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్లో  జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా మెగా154′  రూపుదిద్దుకుంటుంది. తాజాగా ‘మెగా154’ టీమ్ ఈరోజు నుండి డబ్బింగ్ ప్రారంభించింది. 2023 సంక్రాంతికి సినిమా విడుదల కానున్న నేపధ్యంలో షెడ్యూల్ ప్రకారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ‘మెగా154′ టైటిల్  టీజర్ అప్డేట్ కూడా వచ్చింది. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ విడుదల కానుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేస్తూ.. ”బాబీ సర్ కి అభినందనలు . మీ కల నిజం కాబోతుంది.  దీపావళికి బాస్ ఎక్సయిటింగ్ టీజర్. నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్  పూర్తి చేసాను. మీ అందరితో కలిసి మెగా మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూడటానికి సంక్రాంతి వరకు ఆగలేకపోతున్నా’ అని వెల్లడించారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.  నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు. సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ) నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్ ఎడిటర్: నిరంజన్ దేవరమానే ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్ సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి సిఈవో: చెర్రీ కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి పీఆర్వో: వంశీ-శేఖర్ పబ్లిసిటీ: బాబా సాయి కుమార్ మార్కెటింగ్: ఫస్ట్ షో

Related Posts

Latest News Updates