హీరో సుమన్ ను ప్రశంసిస్తూ… వీడియో విడుదల చేసిన మెగాస్టార్

నటుడు సుమన్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. 10 భాషల్లో దాదాపు 500 కి పైగా చిత్రాల్లో నటించడం గొప్ప విజయమని అన్నారు. సుమన్ ఇండస్ట్రీలోకి వచ్చి 45 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా ఓ వీడియో ద్వారా చిరంజీవి సుమన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ”మైడియర్ బ్రదర్ సుమన్… నటుడిగా నువ్వు 45 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా వుంది. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నీ కమిట్ మెంట్ ఏంటో నువ్వు నటించిన సినిమాలే చెబుతాయి. ఇంకా మరిన్ని సంవత్సరాలు లక్షలాది అభిమానులను ఇలాగే అలరిస్తావని ఆశిస్తున్నా. ఈ నెల 16 న బెంగళూరు వేదికగా జరగబోయే నీ ఈవెంట్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా” అంటూ చిరంజీవి వీడియో విడుదల చేశారు.

Related Posts

Latest News Updates