”ఆర్ఆర్ఆర్” చిత్రంలోని ”నాటు నాటు” పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఇదో చారిత్రక విజయమని చిరంజీవి అభివర్ణించారు. ఈ అవార్డును అందుకోవడం పట్ల తాము, దేశం గర్వంగా భావిస్తోందన్నారు. ఈ మేరకు చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి అండ్ టీమ్ కి చిరు శుభాకాంక్షలు తెలిపారు. నాటునాటు పాటకి కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అందుకోవడం ఆనందంగా వుందని, దేశమే కాదు.. ప్రపంచం మొత్తం ఈ రోజు మీతో కలిసి డ్యాన్స్ చేస్తోందని అన్నారు. చరణ్, తారక్ తో పాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్, రాహుల్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ రక్షిత్ కి కంగ్రాట్స్ అని చిరు ట్వీట్ చేశారు.
https://twitter.com/KChiruTweets/status/1612992624511836162?s=20&t=Tb5x7PKv3NfJrIsZj7w6cQ













