హాస్య నటుడు బ్రహ్మానందానికి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కామెడీకి ఆయనో నిలవెత్తు నిదర్శనమని అన్నారు. తనకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో ఓ లెక్చరర్ అని, ఈ రోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కెక్కిన గొప్ప హాస్యనటుడు అని అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అని, అతని మొహం చూస్తేనే హస్యం వెల్లివిరుస్తుందన్నారు. ఇలాంటి బ్రహ్మానందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పది మందిని నవ్విస్తూ వుంాలని, మరింత బ్రహ్మాండమైన భవిష్యత్తు వుండాలని ఆకాంక్షించారు.
https://twitter.com/KChiruTweets/status/1620697966431596545?s=20&t=nJA9-7FlqfiqiBdSiJGTbg












