మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహ‌న్ రాజా  డైరెక్షన్‌లో దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గాడ్ ఫాదర్’ . మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ కు ఇది రీమేక్. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.  బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి  లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే! ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు, ఇటీవల విడుదలైన ‘తార్ మార్ టక్కర్ మార్’ సాంగ్ కు  మంచి రెస్పాన్స్ వచ్చింది.   తాజాగా గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు అయింది. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంకా తేదీని కన్ఫార్మ్ చేయలేదు. గాడ్ ఫాదర్ టీజర్‌ను.. ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక గ్రౌండ్‌ను మిక్స్ చేసి వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో సైరా నరసింహారెడ్డి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కూడా పవన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అన్నదమ్ములు ఇద్దరు ఒకే వేదికపై కలిసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

Related Posts

Latest News Updates