జగిత్యాలలో చిరంజీవిపై గుడ్లు విసిరిన పబ్లిక్… వైరల్ అవుతున్న మెగాస్టార్ మాట

ఈ మధ్య ఓటీటీలకు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఈ టాక్ షోలు రియాలిటీకి బాగా దగ్గరగా వుండటంతో ప్రజల నుంచి మరింత రెస్పాన్స్ వస్తోంది. తాజాగా నందమూరి బాలయ్య నిర్వహిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ టాక్ షో బాగా వైరల్ అయ్యింది. తాజాగా సింగర్ స్మిత నిజం విత్ స్మిత అంటూ ఓ టాక్ షో ప్రారంభించింది. ఈ టాక్ షోకు సోనిలివ్ వేదికైంది. మరో 2 రోజుల్లో ఈ షో ప్రారంభం కానుంది. మొదటి ఎపిసోడ్ లో చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.

ఈ ప్రోమోలో కాలేజ్‌ డేస్‌లో ఫస్ట్‌ క్రష్‌, స్టార్‌డమ్‌ వచ్చే క్రమంలో జరిగిన అవమానాల గురించి స్మిత అడగ్గా.. చిరు తనకు జగిత్యాలలో జరిగిన అవమానం గురించి చెప్పుకొచ్చాడు. ఓ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు పై నుండి పూల వర్షం కురిసింది. కొంచెం ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు విసిరి కొట్టారంటూ చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. స్టార్ డమ్ సొంతం చేసుకునే క్రమంలో మీకు ఎదురైన అవమానాలు ఏమిటి? అంటూ సింగర్ స్మిత అడిగింది. అదే విధంగా తన కెరీర్ ఎలా మొదలైంది?అని అడగ్గా… చిరంజీవి పై విషయాన్ని వెల్లడించారు.

Related Posts

Latest News Updates