మెగాస్టార్, రవితేజ మధ్య గ్యాప్ వుందా? క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? వారిద్దరి మధ్య గ్యాప్ వుందా? ప్రస్తుతం నెట్టింట ఇదే చర్చ సాగుతోంది. ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. అయితే… అన్ని మాట్లాడారు కానీ.. రవితేజ గురించి చిరంజీవి మాట్లాడలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ అయ్యింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రవితేజపై ప్రశంసలు కురిపించారు.

వాల్తేరు వీరయ్య టీం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆహ్లాదంగా సాగింది. చిత్రం యూనిట్ వారి అనుభవాలు పంచుకోవడంతో ప్రీ రిలీజ్ ఈవెంట అంత సంతోషంగా అయ్యింది. అయితే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ వుంటుంది కాబట్టి.. ఇక్కడ క్లుప్తంగానే మాట్లాడదామని అనుకున్నా. కానీ.. ఆశ్చర్యకరంగా అందరి గురించి మాట్లాడిన నేను.. నా తమ్ముడు, వీరయ్యకు అతి ముఖ్యుడు అయిన రవితేజ గురించ చెప్పడం మర్చిపోయా. సమావేశం అయిపోయి.. ఇంటికి వస్తున్నప్పుడు ఇది గుర్తొచ్చి.. వెలితిగా ఫీలయ్యా. అందుకే ట్వీట్ చేస్తున్నా అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

Related Posts

Latest News Updates