మెగా ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్. త్వరలోనే మెగస్టార్ తనయుడు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తమ కులదైవం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్- ఉపాసన దంపతులు మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. విత్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ సురేఖ- చిరంజీవి కొణిదెల, శోభన- అనిల్ కామినేని అని అందులో వుంది. దీంతో మెగా అభిమానుల్లో ఆనందం నెలకొంది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022












