గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేసిన మెగాస్టార్.. రవితేజ వున్నాడనే అలానట…

వాల్తేరు వీరయ్య… సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇప్పుడు అన్ని థియేటర్లలోనూ ఇదే ముచ్చట. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజై భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. తొలిరోజే దాదాపు రూ. 30 కోట్ల షేర్‌ కలెక్షన్‌లు సాధించి బాక్సాఫీస్‌ దగ్గర మెగాస్టార్‌ స్టామినా ఏంటో నిరూపించింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా బ్రహ్మాండంగా నటించాడు. చిరంజీవికి, రవితేజ మధ్య కూడా అద్భుతమైన ఫార్ములా నడుస్తుంది. అయితే… ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ చనిపోతుంది.

 

అయితే.. ఈ సీన్ లో చిరు గ్లిజరిన్ కూడా వాడకుండానే చిరు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించాడు. ఆ ఎమోషనల్‌ సీన్‌ చేసే సమయంలో నిజానికి రవితేజ కాకుండా ఇంకెవరైనా ఆంటే కన్నీళ్లు వచ్చేవి కావేమో అని చెప్పుకొచ్చాడు. రవితేజను తమ్ముడిగా భావించడం వల్లే అలా గ్లిజరిన్‌ లేకుండా కన్నీళ్లు వచ్చాయని చిరు, రవితేజపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. అంతేకాకుండా వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ అన్ని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని మెగాస్టార్‌ పేర్కొన్నాడు.

Related Posts

Latest News Updates