మెగాస్టార్ చిరంజీవి తన తండ్రిని గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నారు. తల్లి అంజనా దేవితో కలిసి సోదరుడు నాగబాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి, చిరంజీవి సోదరీమణులు నివాళులు అర్పించారు. తన తండ్రితో కలిసి వున్న కుటుంబ ఫొటోను చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదొడుకుల పట్ల అవగాహన పంచి, తమతో ఎప్పుడూ తోడుగా వుండి మా విజయాలకు బాటను ఏర్పర్చిన మా తండ్రి వెంకట్రావు గారిని స్మరించుకుంటూ అంటూ చిరంజీవి భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల
అవగాహన పంచి,
మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన
మా తండ్రి వెంకట్రావు గారిని
ఆయన సంవత్సరీకం సందర్బంగా
స్మరించుకుంటూ .. pic.twitter.com/epHicHCxbc— Chiranjeevi Konidela (@KChiruTweets) December 24, 2022