మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ నుంచి ‘థార్ మార్..’ అంటూ సాగే ఆడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే లిరికల్ సాంగ్ వస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకోగా.. మూవీ మేకర్స్ నిరాశకు గురి చేశారు. ‘గాడ్ ఫాదర్’ మూవీ టీమ్‌పై మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ‘థార్ మార్..’ లిరికల్ సాంగ్ వస్తుందని అందరూ ఎక్స్‌పెర్ట్ చేయగా.. మూవీ మేకర్స్ తీవ్ర నిరాశకు గురిచేశారు. ‘థార్ మార్’ ఆడియో సాంగ్‌ను స్పాటిఫై యాప్‌లో విడుదల చేయడంతో ఫైర్ అవుతున్నారు. లిరికల్ సాంగ్ త్వరలో వస్తుందని చిత్ర బృందం ట్వీట్ చేసింది. ఈ మాత్రం సాంగ్ రిలీజ్ చేసేందుకు ఎందుకు ప్రమోషన్స్ చేశారని మెగా ఫాన్స్ మండిపడుతున్నారు. చిరంజీవి మాస్ స్టెప్పులు చూద్దామని ఎంతో ఆశగా ఎదురుచూశామని.. కానీ మూవీ మేకర్స్ ఇలా చేస్తారని ఊహించలేదని తిట్టుకుంటున్నారు. స్పాటిఫై యాప్‌ను ప్రమోట్ చేసేందుకు ఆడియో సాంగ్ రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రోమోతో ఆశలు పెంచి.. ఇలా చేయడం సరికాదని అంటున్నారు. మోహన్ రాజా డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ కు ఇది రీమేక్. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది చిత్ర బృందం. అందులో భాగంగానే ఆడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ఉంటే.. ఈపాటికే సోషల్ మీడియా మార్మోగిపోయేది.
https://twitter.com/KonidelaPro/status/1570410580707803137