కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న ప్రీతి ఆత్మహత్యాయత్నం మరిచిపోక ముందే తెలంగాణలో మరో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ లోని హర్ష అనే మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ పూర్తి పేరు దాసరి హర్ష. ఆదిలాబాద్ జిల్లా జన్నారం స్వస్థలం. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కానీ… హర్ష హాస్టల్ లోనే వుండిపోయాడు.

 

అనుమానం వచ్చి స్నేహితులు చూడగా… హాస్టల్ గదిలో ఉరేసుకొని కనిపించాడు. దీంతో వారందరూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే హర్ష ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నారు. మరోవైపు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.