వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.. ఈ కార్యక్రమంలో ..
నవదీప్ మాట్లాడుతూ.. “గతంలో పల్లెటూర్లలోని ప్రజలు అందరూ ఒక కుటుంబంలాగా ఉండేవాళ్లు. సాయంత్రమైతే ఓ ఇంటి వద్ద అందరూ కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్లు. అలాంటి ఎమోషన్స్‌ను డైరెక్టర్ గారు చక్కగా చూపించారు. రకరకాల మనుషులు ఉన్నారు. ఒకరికి పిల్లి నచ్చదు. ఒకరికి కుక్క నచ్చదు. అన్ని పాత్రలను డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఎప్పుడో రామానాయుడు గారు మొదలు పెట్టిన ఒక అఖండ దీపాన్ని ముందుకు తీసుకువెళుతూ.. యంగ్ టీమ్‌ను, కొత్త ప్రొడక్ట్స్‌ను స్క్రీన్‌పై తీసుకువస్తున్న మా రానాకు ఆల్ ద బెస్ట్. మాయాబజార్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. “మాయబజార్ మూడో ఎపిసోడ్ కొంచెం చూశాం. నాకు అద్భుతంగా నచ్చింది. ఇంతమంది నటీనటులను కలిపి ఒక చోట చేర్చడం చాలా కష్టమైన పని. నేను మారేడ్‌పల్లి జాగృతి రెసిడెన్సీలో ఉండే వాడిని. ఆ టైమ్‌లో బాల్కనీలో కాఫీ తాగుతుంటే.. నా ఎదురుగా ఒక అమ్మాయి పుస్తకాలు చదువుతున్నట్లు తిరిగేది. అదే టైమ్‌కు మా మమ్మీ చెడ్డీని ఆరేస్తూ కట్టేతో ఇలా అంటే.. అది ఆమె బాల్కనీలో పడ్డది. దెబ్బకు నా లవ్ లైన్ బ్రేక్ అయింది. ఇలాంటి ఎన్నో కథలు కమ్యూనిటీలో జరుగుతాయి. అన్ని విషయాలు గౌతమి మీ ముందుకు తీసుకువస్తోంది. ఫ్యామిలీ మొత్తం కాఫీ, బిస్కెట్లు పెట్టుకుని హ్యాపీగా చూడండి. తప్పకుండా జీ5లో చూడండి. ఇది సరికొత్త అమృతంలా మారుతుంది” అని అన్నారు.
సీనియర్ నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడే మూడు ఎపిసోడ్స్ చూశా. కాన్సెప్ట్, వర్క్‌షాప్, షూట్ దగ్గర నుంచి ఇవాళ ఫస్ట్ కాపీ చూస్తున్నా. మాయాబజార్ గురించి చెప్పాలంటే.. టీవీ, ఓటీటీలో ఇది ఒలింపిక్ గేమ్‌ఛేంజర్. మూడు ఎపిసోడ్స్ చూశా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంత మంది నటులను చూస్తుంటే బాహుబలి ప్రీమియర్ కనిపిస్తోంది. డైరెక్టర్ గౌతమికి వచ్చిన పూనకమే ఇవాళ ఫైనల్ రిజల్ట్. సాధారణంగా మహిళలు పిల్లలకు బట్టలు వేసి.. స్కూల్‌కు పంపించి డైరెక్షన్ చేస్తున్నారని అంటున్నాం. మా అమ్మ మొదలు పెట్టారు ఇది. మరో ఐదేళ్ల తరువాత నేను ఇదే స్టేజ్‌పై నుంచి చెబుతా. మగ దర్శకులందరూ కూడా ఇంట్లో పిల్లలకు బట్టలు వేసి.. వంటలు చేసుకోంటారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం అందరూ మహిళలే ఉన్నారు. ఇదే భవిష్యత్ అని మా అమ్మ చెప్పేవారు. డైరెక్టర్ గౌతమి చాలా అద్భుతంగా పని చేసింది. షూటింగ్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశా. డీఓపీ, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. మాయాబజార్‌లో నా లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను ఇలాంటి లుక్‌లో కనిపించాలని అనుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ సంవత్సరం 50వ గోల్డెన్ ఇయర్ జరుగుతోంది. వరుసగా మూడు హిట్స్ కొట్టాం. మాయా బజార్ కూడా సూపర్‌గా ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అనేవి పోయాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ప్రొజెక్టర్, స్క్రీన్ ఉన్నాయి. వెండితెరలు మన ఇంట్లోనే ఉన్నాయి. ప్రతి తెలుగు ఆడియన్ చూడాల్సిన సినిమా ఇది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా తప్పకండా చూడండి. అందరూ చాలా బాగా నటించారు. ఇరుగు పొరుగు అనేది చాలా ముఖ్యం. అపార్ట్‌మెంట్స్ వచ్చిన తరువాత కాస్త తగ్గింది. విల్లాస్ అనేది బ్యూటీఫుల్ కాన్సెప్ట్. చిన్న గ్రామంలా బ్యూటీఫుల్‌గా చూపించారు. నా కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి. జీ5లో ఒలింపిక్ గేమ్ ఛేంజర్ రాబోతుంది. పార్ట్-2 వచ్చినా మీరు ఆశ్చర్యపోకండి” అని అన్నారు.
దర్శకురాలు గౌతమి మాట్లాడుతూ.. “నా కుటుంబం లేకపోతే నేను ఇక్కడ లేను. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మా పాపకు బాగా ఫీవర్ వచ్చింది. నా కుటుంబ సభ్యులు అంతా చూసుకోవడంతో నేను షూటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టా. నా కుటుంబానికి థ్యాంక్స్. శ్వేతా టీసీఎస్‌లో పనిచేసేది. నేను సీఎస్‌సీలో వర్క్ చేసేదాన్ని. ఇద్దరం సాయంత్రం బండిపై వెళుతూ.. కేపీహెచ్‌బీలో కూరగాయలు కొనుక్కొని బెండకాయలు కట్ చేసుకుంటూ భవిష్యత్‌లో ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని అనుకునే వాళ్లం. కలిసి రాయాలి. కలిసి పనిచేయాలని అనుకునే వాళ్లం. నేను ఇంత పెద్ద సిరీస్ చేస్తానని అనుకోలేదు. నాకు కష్టమైన పరీక్ష రాస్తున్న పరిస్థితి. నటీనటులందరికీ థ్యాంక్స్. ఝాన్సీ గారి రోల్ మా అమ్మలానే ఉంటుంది. నన్ను తిట్టి తిట్టి పెంచింది మా అమ్మ. ఝాన్సీ గారి పాత్ర అలానే ఉంటుంది. మరో అమ్మ పాత్ర నాలా ఉంటుంది. చాలా మదర్స్‌కు ఎవరు ఎలా పోయినా సరే.. వాళ్ల పిల్లలు ఒక ముద్ద తింటే చాలు. స్క్రీన్‌పై ఇలాంటి పాత్రలు చాలా బాగా వచ్చాయి. ఇషా ఇందులో పాత్రకు ఒప్పుకుంటుందో లేదో అనుకున్నా. కానీ ఇషా చాలా స్పోర్టివ్. షూటింగ్‌లో ప్రతి రోజూ ఎంజాయ్ చేశా. ఇప్పుడు ప్రొడక్షన్ హ్యాంగోవర్ ఉంది. ఇంటికి వెళ్లిన తరువాత రేపటి నుంచి ఏం చేయాలో తెలియదు. అమృతంలాగా మనలో ఒక స్టోరీ అవ్వాలని మేము రాశాం. అందరూ తప్పకుండా చూడండి” అని కోరారు.
మ్యూజిక్ డైరెక్టర్ జెర్రీ మాట్లాడుతూ ‘‘జీ 5లో నేను చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. నేను ఒక్కడినే ఈ సినిమాకు కంపోజ్ చేయలేదు. మంచి టీమ్‌తో సింజిత్, అనూప్ వంటి వాళ్లు కూడా నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో ప్రధాన తారాగణంపై ఒక సాంగ్‌ను కంపోజ్ చేశాం. చక్కగా వచ్చింది. మంచి బీజీఎం కుదిరింది’’ అన్నారు.
లిరిక్ రైటర్ ఉమ మాట్లాడుతూ ‘‘నేను అవకాశాల కోసం చాలా చోట్లనే తిరిగాను. కానీ ఎవరూ ఇవ్వలేదు. కారణం లిరిక్ రైటర్‌గా అనుభవం లేదు. కానీ గౌతమిగారు ధైర్యం చేసి పాటలు రాయించుకున్నారు. ఆమెకు ఈ సందర్భంగా థాంక్స్’’ అన్నారు.
రైటర్ శ్వేత మాట్లాడుతూ ‘‘మేం రైటర్స్‌గా ఏదో ఆలోచించి రాసేస్తుంటాం. కానీ ఎంటైర్ టీమ్ మాయాబజార్‌ఫర్ సేల్ కోసం వర్క్ చేశారు. దీంతో అనుకున్న దాని కంటే మంచి ఔట్‌పుట్ వచ్చింది’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రణవ్ మాట్లాడుతూ ‘‘ఎంటైర్ టీమ్‌కి థాంక్స్. అందరూ బాగా కష్టపడ్డారు. మాయాబజార్ ఫర్ సేల్ తెలుగు ఆడియెన్స్‌ను నవ్వుల్లో ముంచెత్తుందని కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు.
హరితేజ మాట్లాడుతూ.. “నేను ఒరిజనల్‌గా ఏది కాదో.. ఇందులో ఆ పాత్రను చేశా. ముందు ఈ పాత్ర చేయడానికి భయపడ్డా. నేను చేయగలుతానా లేదా అని ఆలోచించా. నేను నా బెస్ట్ ఇచ్చా. ‘మాయాబజార్ ఫర్ సేల్’విడుదల కోసం చాలా ఎదురుచూస్తున్నా. హ్యాపీగా ఎపిసోడ్స్ చూసి ఎంజాయ్ చేయండి. టీజర్స్, ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ చూస్తుంటే.. సక్సెస్ ఫీలింగ్ వచ్చేసింది. ఈ రోజు నైట్ నుంచి మీరు ఎంజాయ్ చేయండి” అని అన్నారు.
రవి వర్మ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేను కామిక్ రోల్ చేశా. నరేష్ గారితో కలిసి పని చేసి ఎంతో నేర్చుకున్నా. హరితేజ తన పాత్రలో అల్లుకుపోయింది. ఆమె కాంబినేషన్‌లో వర్క్ చేయడం చాలా బాగుంది. రచయితలు కథ చెబుతున్నప్పుడే చాలా నవ్వొచ్చింది. అందరికీ థ్యాంక్స్’ అని చెప్పారు.
సీనియర్ నటి గీతా మాట్లాడుతూ.. ‘మీరు మాయబజార్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో నేను చిన్న క్యారెక్టర్ పోషించా. అందరూ తప్పకుండా చూడండి..’ అని కోరారు. నటుడు శివనారాయణ్ మాట్లాడుతూ.. ‘ఫస్ట్ మూడు ఎపిసోడ్స్ సీరియస్‌గా ఉన్నాం. ఆ తరువాత తెలుస్తుంది నా పరిస్థితి ఏంటి అని. అమృతం తరువాత నేను విలన్ రోల్ చేశా. అందరూ చూడండి. తప్పకుండా ఆశీర్వదించండి’ అని కోరారు.
జీ5 కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయితేజ మాట్లాడుతూ.. “చీఫ్ గెస్ట్‌గా వచ్చిన తరుణ్ భాస్కర్ గారికి థ్యాంక్స్. ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ చేసి సూపర్ హిట్ ఇచ్చారు. రీరిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారు. ఇక మాయబజార్ విషయానికి వస్తే.. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. కంటెంట్ ఉంటే మన తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్ మా మాయబజార్.
మా జీ5 ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో మాయబజార్ అగ్రస్థానంలో ఉంటుంది. సకుటుంబ సపరివార సమేతంగా మాయబజార్‌ను చూడొచ్చు. చక్కగా నవిస్తారు. క్లైమాక్స్‌లో అంతగా ఏడిపిస్తారు. చాలా బాగుంటుంది. అందరూ చాలా అద్భుతంగా చేశారు. అడ్డమైన ప్రైవసీలో చూడకండి. జీ5లోనే చూడండి. ఈ రోజు అర్ధరాత్రి మీ ముందుకు రాబోతున్నాం. తలుపులు క్లోజ్ చేసుకోండి. టీవీలు ఓపెన్ చేసుకోండి.. గౌతమి గారు మాకు మాయబజార్లు, మాయసభలు ఎన్నో అందించాలని కోరుకుంటున్నా. ఈ పాత్రకు ఒప్పుకున్నందుకు ఇషా రెబ్బా గారికి చాలా థ్యాంక్స్..” అని చెప్పారు.
ఇషా రెబ్బా మాట్లాడుతూ.. “గౌతమి కథ చెబుతున్నప్పుడు మా కమ్యూనిటీలో జరిగే విషయాలకు చాలా దగ్గరగా ఉంది. నేను ఈ పాత్ర చేస్తానా లేదా కాదు. ముందు గౌతమి నన్ను తీసుకుంటుందా లేదా అని అనిపించింది. నేను ఈ ప్రాజెక్ట్‌లో ఉంటానా లేదా భయమేసి.. ముందుగానే బ్లాక్ చేయించా. నాకు చాలా చాలా నచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది.. అందరూ తప్పకుండా చూడాలి” అని కోరారు.