మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి స్మృతిఇరానీ ప్రకటించారు. ఇప్పటికే ఉన్నత విద్య కోసం కేంద్రం అమలు చేస్తున్న ఫెలోషిప్ పథకాలు వున్నాయని, మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలిషిప్ అందులోకే వస్తుందని స్పష్టం చేశారు. అందుకే 2022-2023 నుంచి మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ను రద్దు చేస్తున్నామని ఇరానీ లోక్ సభలో ప్రకటించారు. యూజీసీ లెక్కల ప్రకారం 2014-15 మరియు 2021-22 మధ్య కాలంలో ఫెలోషిప్ కింద మొత్తం 738.85 కోట్లను పంపిణీ చేశామని ఇరానీ పేర్కొన్నారు.












