తమిళనాడులోని విరుదునగర్ శివకాశి భద్రకాళి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే… ఇందులో ప్రాణనష్టం ఏమాత్రం జరగలేదు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన రంగప్రవేశం చేసి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆలయ గోపుర పునరుద్ధరణ పనులు జరుగుతుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదాన్ని వెంటనే గమనించిన తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది 45 నిమిషాల్లో మంటలను అదుపు చేశారు. అయితే… ఆలయం బయట బాణాసంచా పేలుడుతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












