ఢిల్లీ లిక్కర్ స్కాం : సీబీఐ విచారణకు హాజరుకానున్న సిసోడియా.. అరెస్ట్ అంటూ ఊహాగానాలు

దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీబీఐ, ఈడీ దేశ వ్యాప్తంగా దాడులు చేసి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే.. ముందు నుంచి కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పాత్ర ఈ అవకతవకల్లో విపరీతంగా వుందని సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా పలు మార్లు సిసోడియా ఇళ్లపై, ఆయన ఆప్తుల ఇళ్లపై సీబీఐ రైడ్స్ కూడా నిర్వహించింది. తాజాగా… లిక్కర్ కుంభకోణంలో విచారణ నిమిత్తం సోమవారం తమ ముందు హాజరు కావాలని సీబీఐ నోటీసులిచ్చింది. దీంతో మరికాసేపట్లో సిసోడియా సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు.

 

 

విచారణ నిమిత్తం సిసోడియా ఇంటి నుంచి బయల్దేరారు. ఇక… ఈ కేసులో దర్యాప్తుకు సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే.. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా… బీజేపీ ప్లాన్ చేసిందని, అందుకే తనను అరెస్ట్ చేయనున్నారని ఆరోపించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుుకుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లాంటి పాఠశాలలు గుజరాత్ లో కూడా నిర్మిస్తామని ప్రకటించామని, ఇదే కొందరికి నచ్చడం లేదని సిసోడియా మండిపడ్డారు.

 

 

Related Posts

Latest News Updates