మంగళూరు ఆటో పేలుడు : కుక్కర్ బాంబు పట్టుకొని ఆటో ఎక్కడిన ఉగ్రవాది

మంగళూరు ఆటో పేలుడుపై పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. కొన్నేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాది షరీక్ కుక్కర్ బాంబు పట్టుకొని ఆటో ఎక్కాడని, అది పేలిందని కర్నాటక ఏడీజీపీ అలోక్ కుమార్ ప్రకటించారు. ఈ కుక్కర్ బాంబు పేలుడుతో డ్రైవర్ పురుషోత్తం పూజారీ, ఇస్లామిక్ ఉగ్రవాది షరీక్ గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. అయితే… ఉగ్రవాది షరీక్ సురేంద్రన్ పేరుతో ఓ సిమ్ కార్డు తీసుకున్నాడని, అలాగే సండూర్ కి చెందిన అరుణ్ కుమార్ గావ్లీ పేరుతో ఆధార్ కూడా తీసుకున్నాడని, వీరందర్నీ విచారిస్తామని ఏడీజీపీ ప్రకటించారు. అయితే… షరీక్ అనే ఇస్లామిక్ ఉగ్రవాదికి పలు అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన చేసిన పనుల వల్ల ఇది రూఢీ అవుతోందని పోలీసు అధికారి ప్రకటించారు.

 

కర్నాటకలోని మంగళూరులో శనివారం జరిగిన ఆటోరిక్షా పేలుడు ఉగ్రవాద చర్య అని ఆ రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. భారీ నష్టం కలుగజేయాలన్న ఉద్దేశంతోనే దుండగులు ఇలాంటి చర్యకు పూనుకున్నారని డీజీపీ పేర్కొన్నారు. దీనిపై లోతైన విచారణ చేస్తున్నామని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం కూడా తీసుకుంటున్నామని డీజీపీ ప్రకటించారు. మంగళూరులో శనివారం సాయంత్రం ఓ ఆటోలో పేలుడు సంభవించింది. దీంతో ఓ ప్రయాణికుడు, డ్రైవర్ గాయపడ్డారు. అయితే.. ఇది పేలుడా? అగ్నిప్రమాదమా? అని తెలియలేదు. చివరికి ఉగ్రవాద చర్యే అని పోలీసులు ధ్రువీకరించారు.

Related Posts

Latest News Updates