రెండు రోజుల్లో ఓ ఫ్లాష్ న్యూస్ చెబుతానంటూ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు, ఇండస్ట్రీ ఏం చెబుతాడోనని ఆసక్తిగా ఎదురు చూశారు. అన్నట్లుగానే అసలు విషయం చెప్పేశాడు. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని ప్రకటించాడు. కానీ.. అది పెళ్లి కాదని, కొత్త సినిమా గురించి అని అన్నాడు. వాట్ ద ఫిష్ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని వెల్లడించాడు. ఈ సినిమా ప్రేక్షకులందరికీ క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందన్నాడు. ఈ ట్వీట్ కి సినిమా పోస్టర్ ను కూడా జత చేశాడు.
https://twitter.com/HeroManoj1/status/1616288308874838016?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1616288308874838016%7Ctwgr%5E57cbdbe3e932add9765bf58529cf9d092593ae97%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fwhat-fish-manchu-manoj-announce-his-next-movie-crazy-title-1519247












