హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి నివాసంలోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. సోదరుడు మంచు మనోజ్ పై లక్ష్మికి అపారమైన ప్రేమ. ఈ కారణంగానే మంచు లక్ష్మి అన్నీ తానై… తన నివాసంలోనే ఈ పెళ్లి వేడుక జరిపించింది. శుక్రవారం రాత్రి 8:30 నిమిషాలకు మంచు మనోజ్ మౌనిక రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి వేడుకను అన్నీ తానై చూసుకొని, గ్రాండ్ సక్సెస్ చేసిన సోదరి లక్ష్మీకి మంచుమనోజ్ థ్యాంక్స్ చెప్పాడు. ”అక్కా ఏ జన్మ పుణ్యమో నాది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్.. లవ్ యూ అక్క” అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు













