గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ ఫంక్షన్ కి సమంత కూడా హాజరైంది. తనకు ఆరోగ్యం బాగో లేకపోయినా ఈ ఫంక్షన్ కి వచ్చానని, గుణశేఖర్ కోసమే వచ్చానని పేర్కొంది. అయితే… ఈ సందర్భంగా గుణ శేఖర్ మాట్లాడిన మాటలకు సమంత కన్నీరు పెట్టుకుంది. ఇది బాగా వైరల్ అయ్యింది. అయితే.. శాకుంతలం మూవీ, సమంతపై నటి మంచు లక్ష్మీ ఓ ట్వీట్ చేశారు. సమంత అద్భుతంగా చేశావు. నాన్న దుర్వాస మహర్షి పాత్రలో చూడటం అద్భుతంగా వుంది. అర్హ పాప భరతుడు పాత్రలో బాగా నటించావు అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.
https://twitter.com/LakshmiManchu/status/1612385917255417857?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612385917255417857%7Ctwgr%5Ebcc2a9ceabb469c7ce0f6cd34ce4f736079bb5d6%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fmanchu-lakshmi-interesting-tweet-samantha-shakuntalam-movie-trailer-1516855













