జోడో యాత్రలో భద్రతా వైఫల్యం… రాహుల్ ను కౌగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం గోచరించింది. యాత్రలో భాగంగా ఓ వ్యక్తి హఠాత్తుగా ఉరుకుతూ వచ్చి… రాహుల్ ను గట్టిగా హత్తుకున్నారు. దీంతో అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు ఆ వ్యక్తిని వెంటనే పక్కకు తోసేశారు. ఈ ఘటనతో యాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. భద్రతా యంత్రాంగాన్ని దాటుకొని మరీ వచ్చి… ఆ వ్యక్తి రాహుల్ ను హత్తుకున్నారు. వెంటనే అప్రమత్తమైన రాహుల్.. ఆయన నుంచి దూరం జరిగారు.

ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. హోషియార్‌పూర్‌లోని తండాలో భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ చౌదరి, రాజ్ కుమార్ చబ్బేవాల్‌లు రాహుల్ గాంధీతో పాటుగా యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌధరీ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు.

 

Related Posts

Latest News Updates