విపక్షాలన్నీ ఏకతాటిపైనే వున్నాయని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి, బీజేపీని గద్దెదించుతామని ప్రకటించారు. సీఎం నితీశ్, జార్ఖండ్ సీఎం సోరెన్ తో కలిసి ముందుకు సాగుతామని, వీరు కూడా బీజేపీని గద్దె దించే పనిలోనే వున్నారని తెలిపారు. కోల్ కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ ప్రసంగించారు. తామందరమూ కలిసే పోరాడుతామని, గత 34 ఏళ్లుగా తాను పోరాడుతూనే వున్నానని గుర్తు చేశారు.
బెంగాల్ నుంచి 2024 పోరాటాన్ని ప్రారంభిస్తామన్నారు. నితీశ్, సోరెన్, తాము కలిసే వున్నామని, ఇలాంటి సమయంలో బీజేపీ తన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. బెంగాల్ పర్యటనకు రావాలని బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు వుందని, అయినా రాలేకపోతోందని, బీజేపీకి తనపై ఎందుకంత కోపమో అర్థం కావడం లేదని మండిపడ్డారు. చాలా దేశాల్లో తాను పర్యటించాలని అనుకున్నానని, అయితే బీజేపీ మోకాలడ్డిందని మమత ఆరోపించారు.