కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో బరిలో వున్న ఖర్గే, థరూర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్తి కావాలని తాను ప్రయత్నించానని, థరూర్ మాత్రం పోటీయే అన్నారని ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం థరూర్ పోటీకి మొగ్గు చూపారని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే.. గాంధీ కుటుంబంతో, ఇతర సీనియర్లతో సంప్రదింపులు జరిపి, వారు చెప్పిన మంచి విషయాలు ఆచరిస్తానని అన్నారు.
అయితే.. దీనిపై థరూర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక అనేది పార్టీలో అంతర్గతంగా జరిగే పోటీ కాదన్నారు. ఖర్గే, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చేశారు. ఖర్గే గెలిస్తే కాంగ్రె్‌సలో కార్యకర్తలు కోరుకుంటున్న మార్పు రాదని.. తాను మాత్రమే మార్పు తేగలనని శశి థరూర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇద్దరం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తామన్నదే ప్రశ్న. ఏ పార్టీ అధ్యక్షుడూ గాంధీ కుటుంబానికి దూరంగా ఉండలేరని థరూర్ అన్నారు.