అవన్నీ అవాస్తవాలే… సోనియా మద్దతుతో బరిలో లేను : ఖర్గే క్లారిటీ

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అధిష్ఠానం తరపు వ్యక్తిగా మల్లికార్జున ఖర్గేను సోనియా రంగంలోకి దింపారని జోరుగా వార్తలొచ్చాయి. ఖర్గే పేరును కూడా సోనియానే సూచించారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై చాలా రోజుల తర్వాత మల్లికార్జున ఖర్గే స్పందించారు. అయితే.. ఇవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. సోనియా గాంధీని తాను కలవలేదని, సోనియా తన పేరు సూచించలేదని తేల్చి చెప్పారు. అంతర్గతంగా కూడా సోనియా తనకు మద్దతివ్వడం లేదని పేర్కొన్నారు.

 

”అధ్యక్ష పదవికి నా పేరును సోనియా సూచించినట్లు వస్తున్న వార్తలన్నీ వదంతులే. అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని సోనియా స్పష్టంగా చెప్పారు. నాకే కాదు.. పోటీలో వున్న వారెవ్వరికీ గాంధీ కుటుంబ మద్దతు లేదు”. అని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రతిష్ఠను, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ కుటుంబం పోటీ చేసేందుకు నిరాకరించడం వల్లే.. తాను బరిలోకి దిగానని ఖర్గే పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates