పన్ను ఎగవేత కేసులో మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డితో సహా 12 మంది ఐటీ విచారణకు హాజరయ్యారు. మల్లారెడ్డి సోదరుడు గోపాల్, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు త్రిశూల్ రెడ్డి, మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ మాధవి, కాలేజీ అకౌంటెంట్, ఇద్దరు అకౌంటెంట్స్ కూడా హాజరయ్యారు. అయితే.. ఇందులో ముగ్గురి విచారణ ముగిసింది. తమను ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించలేదని త్రిశూల్ రెడ్డి వెల్లడించారు. గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు తమకు సూచించారని వీరు వెల్లడించారు.







