దిగొచ్చిన మాళవికా మోహనన్…. శాంతించాలంటూ నయనతార ఫ్యాన్స్ కి సూచన

మాస్టర్ బ్యూటీ మాళవికా మోహనన్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య వివాదం రేగింది. మాళవికా మోహనన్ ను విమర్శిస్తూ నయనతార అభిమానులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో చివరికి…. తన వ్యాఖ్యలకు మాళవికా మోహనన్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. హీరోయిన్లందరినీ ఉద్దేశించి నా వ్యాఖ్యలు చేశాను. నా అభిప్రాయం చెప్పాను. అంతేకానీ… ఒక్క హీరోయిన్ ను మాత్రమే ఉద్దేశించి నేను మాట్లాడలేదు. నయనతార అంటే నాకు చాలా అభిమానం. ఆమెను ఓ సీనియర్ గా భావించి, చాలా ప్రేరణ పొందుతాను. అందరూ కాస్త శాంతించండి అంటూ మాళవికా మోహనన్ అన్నారు.

 

తన కొత్త చిత్రం క్రిస్టి ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను వివరించారు. అయితే…. తనను కొందరు లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారని, అది తనకు గిట్టదన్నారు. హీరోల మాదిరిగానే తమను కూడా సూపర్ స్టార్ అని పిలవాలన్నారు. అయితే… నయనతారను ఉద్దేశించే మాళవికా వ్యాఖ్యానించారని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates