మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత జహీరాబాద్ లో వున్న ప్లాంట్ కి అనుబంధంగానే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు, నాలుగు చక్రాల వాహనాలను జహీరాబాద్ ప్లాంట్ లో తయారు చేస్తామని కంపెనీ పేర్కొంది. జహీరాబాద్ తయారీ ప్లాంట్ ను 1000 కోట్లతో చేపట్టామని, దీని ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మహీంద్ర అండ్ మహీంద్రా ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్ లో స్థిరమైన వ్రుద్ధి సాధిస్తున్న వాహన రంగాన్ని మరింత డెవలప్ చేసేందుకే తమ ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని నెలకొల్పిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
https://twitter.com/KTRBRS/status/1623714327961423872?s=20&t=tOi9VHsG3dO9cJxhzKLCgw
ఈ నూతన పరిశ్రమతో కొత్తగా 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కొత్త ప్లాంట్‌లో త్రీ, ఫోర్‌వీలర్ వాహనాలను తయారు చేయనున్నారు. కాగా, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రకటన తరువాత జరిగిన చర్చల్లో భాగంగానే మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక భవిష్యత్తులో ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సంస్థ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జేజురికర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం జహీరాబాద్‌లో ఉన్న తయారీ ప్లాంట్‌ను విస్తరించడం ద్వారా మరిన్ని త్రీవీలర్లను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. తాజా పెట్టుబడితో ఎలక్ట్రిక్ త్రీవీలర్ల తయారీలో తమ స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.