మహేష్ ని SSMB 29 సినిమాలో ఎలా చూపించబోతున్నాడో చెప్పేసిన రాజమౌళి

తెలుగు సినీ ప్రేక్ష‌కులు మహేష్, రాజమౌళి ల కాంబి సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమైవుంటుంది. నిన్ననే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో షూటింగ్ మొదలైంది. దీని త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా రాజమౌళి.. మహేష్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. సూప‌ర్ స్టార్ 29 వ చిత్రంగా రూపొందున్న ఈ సినిమా క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో జ‌క్క‌న్న‌, ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న టోరంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ లో పాల్గొన్నారు. అక్క‌డ తాను త‌దుప‌రి చేయ‌బోతున్న సినిమా గురించి ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హేష్‌తో గ్లోబ‌ల్ మూవీగా, యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ జోన‌ర్‌లో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రాజ‌మౌళి ఓ సినిమాను తెర‌కెక్కించే తీరు సినీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. అలాంటి ఓ డైరెక్ట‌ర్‌లో మ‌హేష్‌తో యాక్ష‌న్ మూవీ చేస్తాన‌ని చెప్ప‌టం చూస్తుంటే సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌కి పూనకాలు రావ‌టం ప‌క్కా అని అర్థ‌మ‌వుతుంది. వ‌చ్చే ప్ర‌థ‌మార్థంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ స‌ర్కిల్స్ టాక్‌. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె యల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆర్ ఆర్ ఆర్ వంటి పీరియాడిక్ మూవీలో రామ్ చరణ్ , ఎన్టీఆర్‌ లను నటింప చేసి అభిమానులను అలరించారు జక్కన్న. దీంతో మహేష్‌తో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో కాదు.. పాన్ వరల్డ్ మూవీగా రాబోతుందనటంలో సందేహం లేదు.

 

Related Posts

Latest News Updates