మహేశ్ బాబు కొత్త సినిమ అప్ డేట్ వచ్చింది. మూవీ టీమ్ అభిమానులకు ఓ క్లారిటీ ఇచ్చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హత్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ఈనెల 18 నుండి స్టార్ట్ చేయబోతున్నారు. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని తెలియజేశాడు.మహేష్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చేశాడు.
ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నట్లు తెలిపాడు. ఇద్దరూ మహేశ్ కి జంటగా వుంటారని, మళ్లీ నెంబర్స్ అంటూ ఏమీ వుండవని కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే… టైటిల్ మాత్రం అనుకోలేదని, సినిమాను మాత్రం ఆగస్ట్ 11 న రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అతడు, ఖలేజా మూవీ తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న చిత్రమిదే.