యూపీ సీఎం యోగి వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత

మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హుస్సేన్ దల్వాయి యూపీ సీఎ యోగి వస్త్రధారణ, సన్యాస దీక్షా వస్త్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగి కాషాయ దుస్తులు ధరించడం మానేయాలని, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం అలవాటు చేసుకోవాలంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ మతం గురించి మాట్లాడకండి, కాషాయ బట్టలు వేసుకోకండి. కొంచెం ఆధునికంగా మారండి. ఆధునిక ఆలోచనలను స్వీకరించండి అంటూ హుస్సేన్ దల్వాయి వ్యాఖ్యలు చేశారు. ఇక… మహారాష్ట్ర పరిశ్రమలను యూపీకి తీసుకెళ్లకుండా, అక్కడే కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నేత అన్నారు. యూపీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి రాష్ట్రంలోని వివిధ రంగాలలో వున్న అవకాశాలను వారికి అందించేందుకు సీఎం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Posts

Latest News Updates