ఆరెస్సెస్ నిర్వహించే ర్యాలీకి అనుమతివ్వాలని తమిళనాడు హైకోర్టు పోలీసులకు తేల్చి చెప్పింది. అయితే.. నవంబర్ 2 న అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం వాదించింది. అయితే.. నవంబర్ 6 న ఆరెస్సెస్ తలపెట్టిన ప్రాంతాల్లో ర్యాలీకి అనుమతివ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఒకవేళ ఆరెస్సెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వని పక్షంలో కోర్టు ధిక్కరణ చర్యలకు రెడీగా వుండాలని కోర్టు పోలీసులను హెచ్చరించింది.
నిజానికి ఈ నెల 2 న 50 ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని సంఘ్ నిర్ణయించుకుంది. సంఘ్ కు అనుమతిస్తే.. తమకూ అనుమతివ్వాలని మరికొన్ని సంస్థలు పట్టుబట్టడంతో ప్రభుత్వం తాము ఇద్దరికీ పర్మిషన్ ఇవ్వమని తెలిపింది. అంతకంటే ముందే సంఘ్ కోర్టు అనుమతులు తెచ్చుకుంది. అనుమతి ఇవ్వకుండా కోర్టును ధిక్కరిస్తున్నారంటూ ఆరెస్సెస్ డీజీపీ, హోంశాఖ కార్యదర్శిపై ఫిర్యాదు చేసింది. దీంతో హైకోర్టు వారికి అనుమతి మంజూరు చేసింది.