ప్రగతి డిగ్రీ కాలేజేస్ లో సందడి చేసిన “మది” బృందం

ప్రగతి పిక్చర్స్ బ్యానర్ పై రామ్ కిషన్  నిర్మిస్తున్న సినిమా మది. ఆర్వి సినిమాస్ సహనిర్మాతలుగా, ఆర్ వి రెడ్డి సమర్పణలో శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకి రానుంది. నాగ ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు పివిఆర్ రాజా సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టొరీ గా రాబోతున్న “మది” ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాలతో పాటుగా U S లో పలు నగరాల్లో విడుదల అవ్వబోతుంది. మది ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బృందం హైదరాబాద్ లోని ప్రగతి గ్రూప్ అఫ్ కాలేజేస్ లో సందడి చేసింది. మది ట్రైలర్ కి విద్యార్దుల స్పందన మది బృందాన్ని సంబర్మాస్చార్యానికి గురిచేసింది. యువతకి నచ్చే అంశాలతో కలగలిపిన ప్రేమ కథ మది. అందుకే వారి నుండి మంచి స్పందన వస్తుంది అని మది బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ నెల 11 న వస్తున్న సినిమా కూడా అందరిని ఆకట్టుకుంటుంది అని దర్శక-నిర్మాతలు తెలిపారు.సహా నిర్మాత శ్రీనివాస్ రామిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన కాలేజీ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ మంజుల రెడ్డి గారు,సీతారామిరెడ్డి గారు, చన్నా రెడ్డి గారు, జయప్రసాద్ గారు మరియు ఫాకల్టీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు ప్రోత్సాహాన్ని అందించారు.నటీనటులు:శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి, రామ్ కిషన్, శ్రీకాంత్ బైరోజ్, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి, శ్రీనివాస్  తదితరులు సాంకేతిక నిపుణులు: నిర్మాతలు: రామ్ కిషన్ సహా నిర్మాత: శ్రీనివాస్ రామిరెడ్డి  కథ-కథనం-మాటలు-దర్శకత్వం: నాగ ధనుష్ కెమెరామెన్: విజయ్ ఠాగూర్ మ్యూజిక్: పివిఆర్.రాజా ఆర్ట్: విజయ్ ఎడిటర్: ప్రదీప్. జంబిగ లిరిక్స్: కడలి, పూర్ణ చారి

Related Posts

Latest News Updates