సినీ ప్రముఖుల సమక్షంలో “మా శంకరన్న ” ట్రైలర్ & సాంగ్స్ విడుదల

సమాజంలో, మరియు కుటుంబాలలో జరుగుతున్న అనుమానాస్పదమైన సమస్యలను, మంచి చెడులను ఎత్తి చూపిస్తూ అట్టి సమస్య లను ఎలా అరికట్టాలి అనే దాని పై చిత్రీకరిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం “మా శంకరన్న “. భళా క్రియేషన్స్ పతాకంపై హీరో, హీరోయిన్స్ గా ,కృష్ణ,శివ శర్వాణి, జబర్దస్త్ ఫణి, షేకింగ్ శేషు, సై సూర్య, కె. స్వాతి, శివ, జోష్న, రాజ్ గోపాల్, రామ్‌జీ రాథోడ్, బుచ్చి రెడ్డి, పవన్ కృష్ణ, కె. శంకర్ నాయక్, సిద్ధార్థ, మహేష్ నాయుడు, రమ్య, రిషిత, ఐవిఎస్ రావు నటీ నటులుగా దర్శకుడు కొర్ర శంకర్ నాయక్ ముప్పల ను పరిచయం చేస్తూ ప్రసాద్ రాజు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఈ చిత్రంలోని మూడు పాటలను, మరియు ట్రైలర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన టి. యఫ్. సి. సి. ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్, అడ్వకేట్ పి. నారాయణ,నటుడు బోస్ బాబు, తదితరులు పాల్గొని మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుతూ చిత్ర యూనిట్ కు సన్మానం చేశారు.

Related Posts

Latest News Updates