రెంట్‌కి డబ్బు లేదు.. స్నానానికి సబ్బు లేదు.. సాయంకాలం పబ్బులేదు.. అయినా తగ్గేది లేదు అని పాట పాడుకుంటున్నారు శ్రీనివాస్ రెడ్డి, సత్య, షకలక శంకర్. అసలు వారికి వచ్చిన బాధలేంటి? అనే విషయం తెలియాలంటే మాత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా చూడాల్సిందేనంటున్నారు చిత్ర సమర్పకుడు కోన వెంకట్, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ. అందాల నటి అంజలి ‘గీతాంజలి’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం “గీతాంజలి మళ్లీ వచ్చింది” చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం.దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది.
గీతాంజలికి సీక్వెల్‌గా రాబోతోన్న ఈ మూవీ కూడా అదే హారర్-కామెడీ జానర్‌లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హారర్ కామెడీ జానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ ఈ హారర్ థ్రిల్లర్ పై అంచనాలను పెంచింది.