అయ్యన్నపాత్రుడి అరెస్ట్ : హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు

టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి అరెస్ట్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అయ్యన్న తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. తనను నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ అరెస్ట్ చేసిందని అయ్యన్న తన పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు దీనిపై మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్, దాని తర్వాత పరిణామాలు, రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేయడం తదితర విషయాలపై చంద్రబాబు లోతుగా చర్చించనున్నారని పార్టీ పేర్కొంది.

Related Posts

Latest News Updates