చంద్ర గ్రహణం – పట్టు విడుపు సమయం

చంద్ర గ్రహణానికు చాలా ప్రాధాన్యం ఉంది. గ్రహణాలను ప్రత్యక్షంగా చూసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా. ఈ గ్రహణాలు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. ఒకటి సూర్య గ్రహణం, మరొకటి చంద్ర గ్రహణం. ఈ మధ్యే ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం ముగిసింది. నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం ఉంది.
2022 నవంబరు 8 మంగళవారం చంద్రగ్రహణం
శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళవారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది.
స్పర్శ కాలం మధ్యాహ్నం – 2 గంటల 38 నిముషాలు
మధ్య కాలం మధ్యాహ్నం – 4 గంటల 28 నిముషాలు
మోక్ష కాలం మధ్యాహ్నం – 6 గంటల 18 నిముషాలు
ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 40 నిముషాలు
ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు… మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు. చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. అందుకే విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఈ గ్రహణం కన్పిస్తుంది.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates