పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న ఓజి సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. కానీ ఇప్పుడదే డేట్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ రిలీజ్ అవుతున్నట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్ గా పోస్టర్ ను రిలీజ్ చేసింది.
దీన్ని బట్టి చూస్తుంటే పవన్ ఓజి చెప్పిన డేట్ కు రిలీజ్ అవడం లేదా అని ఫ్యాన్స్ లో అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే సితార నిర్మాత నాగవంశీకి పవన్ తో మంచి అనుబంధం ఉంది. కాబట్టి పవన్ సినిమాతో కలిపి తన సినిమాను రిలీజ్ చేసి క్లాష్ చేయాలనుకోడు. ఇప్పుడు లక్కీభాస్కర్ ను అదే రోజున రిలీజ్ చేయాలని డిసైడయ్యాడంటే ఓజి విషయంలో తనకు స్పష్టమైన క్లారిటీ ఉండే ఉంటుంది.
ఓజీ టీమ్ నుంచి క్లారిటీ వస్తే ఇక దీని గురించి వదిలేయొచ్చు. వాస్తవానికి ఎలక్షన్స్ అయ్యాక పవన్ షూటింగ్ లో జాయిన్ అవుతారనుకున్నారు కానీ ఫలితాలు టీడీపీ- జనసేన కు అనుకూలంగా వస్తాయని అంటున్న టైమ్ లో పవన్ వెంటనే మేకప్ వేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. డైరెక్టర్ సుజిత్ రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పి ఓజి విషయంలో మంచి హైప్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఈ వార్త పవన్ ఫ్యాన్స్ ను నిరాశకి గురి చేస్తుంది.