‘లవ్ టుడే’ టుడే యూత్ జనరేషన్ మస్ట్ వాచ్

ప్రపంచ తెలుగు.కామ్ రేటింగ్ 3/5 

నిర్మాణ సంస్థ: ఏ జి యస్ ఎంటర్టైన్మెంట్స్,
తెలుగు వెర్షన్ విడుదల : ఎస్ వి సి రిలీజ్ (దిల్ రాజు)
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్, యోగి బాబు, ఇవానా, రాధిక శరత్‌కుమార్, తదితరులు.
సంగీత దర్శకులు: యువన్ శంకర్ రాజా,
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్,
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : అర్చనా కల్పాతి,
నిర్మాతలు : కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్,
దర్శకుడు : ప్రదీప్ రంగనాథన్,
విడుదల తేదీ:25.11.2022

తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించి స్వయంగా దర్శకత్వం వహించిన తమిళ మూవీ లవ్ టుడే తమిళ్ లో నవంబర్ 4న విడుదలై సెన్సషనల్ హిట్ గా నిలిచింది. కేవలం మూడు వారాలకే 50 కోట్ల రెవిన్యూ సొంతం చేసుకుంది ఇప్పుడు తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్నిఈ రోజు విడుదల చేసారు. సినిమా ఎలావుందో సమీక్షలోకి వెళదాం.

కథ ఎలా ఉందంటే?
ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నికిత (ఇవాన) ప్రేమించుకుంటారు. నికితకు వాళ్లింటో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. దాంతో ఆమె త్వ‌ర‌గా త‌న తండ్రితో మాట్లాడ‌మ‌ని ప్ర‌దీప్‌ని కోరుతుంది. త్వ‌ర‌లోనే త‌న అక్క‌య్య పెళ్లి జ‌రుగనుంద‌ని, అది పూర్తి కాగానే క‌లుస్తాన‌ని అంటాడు. అయితే ఆ పెళ్లికి కొన్ని రోజుల ముందే నికిత తండ్రి వేణు శాస్త్రి (స‌త్య‌రాజ్‌) వీరి ప్రేమ విష‌యం తెలిసి పోతుంది. దాంతో ఆయ‌న వేణుని ఇంటికి పిలిపిస్తాడు. ఇద్ద‌రికీ పెళ్లి చేయాలంటే మరో చరిత్ర సినెమాలోలాగా ఓ కండీష‌న్ పెడ‌తాడు. ఓ రోజు ఇద్ద‌రూ త‌మ ఫోన్స్‌ను ఒకరిది ఒకరు మార్చుకోవాల‌ని చెప్తాడు. ఈ కండీష‌న్ కి ఇద్ద‌రూ భ‌య‌ప‌డ‌తారు. కానీ పెళ్లి కోసం వేణు శాస్త్రి చెప్పిన ప‌ని చేయ‌టానికి ఇరువురు అంగీక‌రిస్తారు. అలా ఫోన్స్ మారిన క్ష‌ణం నుంచి ఇద్ద‌రి జీవితాల్లో ఎలాంటి మార్పులు జ‌రిగాయి? ఒక‌రి గురించి మ‌రొక‌రికి తెలిసిన నిజాలు ఏంటి? ఇద్ద‌రూ త‌మ‌కు ఎదురైన మ‌న‌స్ప‌ర్ద‌ల‌ను క్లియ‌ర్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా? లేదా? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్:
సరి కొత్త కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ రంగ‌నాథ్ తానే హీరోగా మారి ల‌వ్ టుడే సినిమాను తెర‌కెక్కించారు. ఈ జనరేషన్ లో..దర్శకుడు కం హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో లవర్స్ మధ్య అద్భుతమైన ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో చాల చక్కగా కనపరిచాడు. మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్యనే నవ్వులను కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో వాస్తవ పరిస్థితులతో కంటెంట్ తయారు చేసుకుని . రాసుకున్న కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. నటన విషయానికి వస్తే.. హీరోగా కూడా నటించిన ప్రదీప్ రంగనాథన్ తన కామెడీ టైమింగ్ తో అండ్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించాడు. సినిమాలోని కోర్ ఎమోషన్ని ప్రదీప్ రంగనాథన్ తన హావభావాలతోనే బాగా పలికించాడు. ముఖ్యంగా సత్యరాజ్ ఎపిసోడ్ చాల బాగుంది. అలాగే హీరోయిన్ ఇవానా కూడా చాలా బాగా నటించింది. ఇక ఈ చిత్రానికి మరో బలం యోగిబాబు కామెడీ. ఆయన తన టైమింగ్ తో బాగా నవ్వించాడు. మిగిలిన ప్రధాన పాత్రధారులు రాధికా శరత్ కుమార్, సత్యరాజ్ కూడా ,తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్ వర్క్:
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే..దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి పైన చెప్పుకున్నాం. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే పై కూడా బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బావుంది. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:
మారుతున్న టెక్నాల‌జీలో భాగంగా సినిమా ప్రేక్ష‌కుడి అభిరుచి కూడా మారింది దీంతో ప్రపంచ సినిమా అనేది భాషా ప‌ర‌మైన బేదాలు లేకుండా ప్రేక్ష‌కులు ఇత‌ర భాషల‌కు చెందిన సినిమాలు చూసి ఎంజాయ్ చేయ‌టం ప్రారంభించారు. రొటీన్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆటోమెటిక్‌గా దూరం పెట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలో కంటెంట్ బావుంటే చాలు కాన్సెప్ట్ బావుంటే చాలు.. హీరోతో ప‌నే లేదు. సినిమాను ప్రేక్ష‌కులు చూసి హిట్ చేసేస్తున్నారు. అలాంటి ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మే ‘లవ్ టుడే’. నేటి కాలం యువ‌త సెల్ ఫోన్స్ మీద ఎంత‌లా ఆధార‌ప‌డుతున్నారు. వాటికి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు.. ఒక‌రి సెల్ ఫోన్స్‌లో సీక్రెట్స్ మ‌రొక‌రి తెలిస్తే ఎలాంటి గొడ‌వ‌లు వ‌స్తాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్ర‌మే ‘లవ్ టుడే’. ప్రేమికుల్లో ఒక‌రిపై మ‌రొకరికి ప్రేమ మాత్ర‌మే కాదు.. త‌మ ప్రేమ ప‌ట్ల న‌మ్మ‌కం ఉండాలి అనే సున్నిత‌మైన విష‌యాన్ని చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. నేటి యూత్ ప్రేమ విష‌యంలో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అది అమ్మాయి కానీ.. అబ్బాయి కానీ అంత‌కు ముందు ఉన్న రిలేష‌న్స్ దాచి పెట్టి ఒక‌రితో ఒక‌రు ఎలా ఉంటున్నార‌నే విష‌యాన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోణంలో చూపించారు ద‌ర్శ‌కుడు. అలాగే నేటి యువ‌త సెల్‌ఫోన్స్ కార‌ణంగా పాడ‌వుతున్నారు. ప్రేమికులు, పెళ్లి చేసుకోవాల‌నుకునేవారు సెల్‌ఫోన్స్ మాయ‌లో ప‌డి దూరాన్ని పెంచేసుకుంటున్నారు. అలా ఉండ‌కూడదు. ఎన్ని గొడ‌వ‌లు వ‌చ్చినా స‌ర్దుకుపోవాల‌ని చెప్పటానికి స‌త్య‌రాజ్ పాత్ర క్రియేట్ చేశారు. దాంతో తాను చెప్పాల‌నుకున్న కొంత విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ వున్నా మూవీస్ చూడాల‌నుకునే వారికి సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది..

Related Posts

Latest News Updates