బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా….. తదుపరి ప్రధాని కోసం ప్రక్రియ ప్రారంభం

బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేసేశారు. కేవలం 45 రోజుల్లోనే అధికారం కోల్పోయిన నేతగా రికార్డు నెలకొల్పారు. అధికారంలోకి వచ్చాక తన నిర్ణయాలతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న లిట్రస్… సొంత పార్టీలోనే తిరుగుబాటు రావడంతో పదవికి రాజీనామా చేసే పరిస్థితులు తలెత్తాయి. ఆర్థిక పరిస్థితులపై సవాళ్లు, మినీ బడ్జెట్ అంటూ పరిస్థితులు దిగజారడం, రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడం, డాలర్ తో పోలిస్తే పౌండ్ విలువ దారుణంగా పడిపోవడం, ధనవంతులకే పన్ను మినహాయింపులు… వీటన్నింటి చట్రంలో లిట్రస్ ఇరుక్కున్నారు. దీంతో ఆమెపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది.

 

ఇవన్నీ ఒకవైపు అయితే.. మరో వైపు సొంత పార్టీ ఎంపీలే లిట్రస్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడిపోయారు. దీంతో ఆమె హతాశురాలైనట్లు సమాచారం. అంతేకాకుండా ఆర్థిక మంత్రికి ట్రస్ ఉద్వాసన పలికి, విదేశాంగ శాఖ మాజీ మంత్రి జెరెమీ హంట్ ను ఆ స్థానంలోకి తీసుకున్నారు. అయితే.. ఇంతటి కీలక పరిణామం ప్రధాని ట్రస్ కు తెలియకుండానే జరిగిపోయింది. ఇవన్నింటి చట్రబంధంలో ఇరుక్కున్న లిట్రస్.. చివరికి ప్రధాని బాధ్యతల నుంచి వైదొలిగారు. పార్టీ తనకు కట్టబెట్టిన బాధ్యతను సమర్థవంతంగా చేయలేకపోయానని, ఆర్థిక అంశాలను సరిగ్గా డీల్ చేయలేకపోయానని, అందుకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.

 

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

నూతన ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియను కన్జర్వేటివ్ ప్రారంభించింది. ఆశావహుల నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ నామినేషన్ల ప్రక్రియ నడుస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. ఏకాభిప్రాయం కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కుదరని పక్షంలో పోటీలో వుండే ఇద్దరి మధ్య ఆన్ లైన్ ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే.. భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ రిషి సునాక్ ప్రధాని రేసులో ముందంజలో వున్నారు. అలాగే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు కూడా వస్తోంది. అలాగే పెన్నీ మోర్డాంట్, సుయెల్లా బ్రేవర్మరన్, రక్షణ మంత్రి బెన్ వాలెస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Related Posts

Latest News Updates