ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు సినిమా అంచనాలను పెంచాయి. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు.దర్శకుడు మేర్లపాక గాంధీ కాన్ ఫ్లిక్ట్ ని రివిల్ చేయకుండానే చాలా చాకచక్యంగా క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్‌ను కట్ చేశాడు. సంతోష్ శోభన్ ట్రావెల్ బ్లాగర్ గా తన యూట్యూబ్ ఛానెల్ కోసం కొత్త వీడియోని షూట్ చేయడానికి వెళ్ళిన ట్రిప్ లో ఫరియా అబ్దుల్లాని కలవడం, ప్రేమలో పడటం చాలా క్రేజీగా ప్రజంట్ చేశారు. కథాంశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.మేర్లపాక గాంధీ కామెడీని డీల్ చేయడంలో దిట్ట. ఈ సినిమాలో కావల్సినంత వినోదాన్ని వుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ట్రైలర్ నక్సల్స్, పోలీసులు, రౌడీ బ్యాచ్ ని ప్రజంట్ చేసిన విధానం చాలా థ్రిల్లింగా వుంది. సంతోష్ శోభన్ డైనమిక్‌గా ఉన్నాడు. ఫరియా అబ్దుల్లాతో లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. బ్రహ్మాజీ టైమ్ బాంబ్ ఎపిసోడ్ నవ్విస్తుంది. నెల్లూరు సుదర్శన్ తన కామిక్ టైమింగ్‌తో అలరించాడు.ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రభాస్ గారికి ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీం తరపున కృతజ్ఞతలు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన కథతో ఎక్ మినీ కథ చేశాను. అది మంచి విజయం సాధించింది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఆయన దర్శకత్వం నటించడం ఆనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయినపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా ని ఈ సినిమాలో చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతారు. బ్రహ్మజీ గారి పాత్ర ఇందులో అవుట్ స్టాండింగ్ గా వుంటుంది. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారుమేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ఫుల్ ఫన్ మూవీ. నాన్ స్టాప్ నవ్వులు వుంటాయి. సంతోష్ శోభన్ తో ఎక్ మినీ కథ చేశాం. తను మంచి యాక్టర్. ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ పాత్రని పెర్ఫెక్ట్ గా చేశాడు. జాతిరత్నాలు తర్వాత ఫరియా అబ్దుల్లా ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. బ్రహ్మజీ, సుదర్శన్ , మైమ్ గోపి, చాలా మంచి నటీనటులు ఇందులో వున్నారు. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. మీ అందరినీ అలరిస్తుంది” అన్నారు.
ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారుబ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ టీంతో కలసి చూశాను. అద్భుతంగా వుంది. జాతిరత్నాలు, డిజే టిల్లు సినిమా నచ్చితే మా సినిమా కూడా వంద శాతం అందరికీ నచ్చుతుంది. మేర్లపాక గాంధీ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. సినిమాలో పని చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది. మా నిర్మాత ఎంతో నమ్మకంగా సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు సినిమా చూసి నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. నవంబర్ 4న అందరూ థియేటర్లో సినిమా చూడాలి” అని కోరారు.సుదర్శన్ మాట్లాడుతూ.. నిన్న రాత్రే టీం అంతా ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ చూశాం. అదిరిపోయింది. నాన్ స్టాప్ గా నవ్వుకుంటారు, మంచి ట్విస్ట్ లు కూడా వున్నాయి. మంచి కథతో మంచి పాత్రని ఇచ్చిన దర్శక నిర్మాతలు , టీం అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు వసంత్ కెమెరా డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.