దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ని నిర్వహించిన చిత్ర యూనిట్ నవంబర్ 4న సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదల కాబోతుంది. ప్రభాస్ గారి చేతులు మీదగా 25న ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ప్రభాస్ అన్న ఫ్యాన్ గా ఇది నాకు చాలా ఎక్సయిటింగా వుంది. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన కథతో ఎక్ మినీ కథ చేశాను. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం అనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా తో నటించడం హ్యాపీగా వుంది. బ్రహ్మజీ గారి పాత్రలోనే కాదు ఆయనతో షూటింగ్ లో కూడా చాలా ఫన్ ని ఎంజాయ్ చేశాం” అని చెప్పుకొచ్చారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా ఒక ఫన్ రైడ్ లాంటి సినిమా. మంచి అడ్వంచరస్, థ్రిల్ ట్రిప్ లా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ట్రైలర్ ని ప్రభాస్ గారి చేతుల మీదగా 25న విడుదల చేస్తున్నాం. 29న ప్రీరిలీజ్ వేడుక చేయబోతున్నాం. నవంబర్ 4న సినిమాని విడుదల చేస్తున్నాం. మాపై నమ్మకంతో ఈ సినిమాని ఎక్కడా రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో ట్రావెల్ వ్లోగ్గేర్ గా కనిపిస్తారు. అందుకే ఈ చిత్రానికి లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అనే టైటిల్ పెట్టాం. ఈ చిత్రంలో సెకండ్ లీడ్ గా చాలా కీలకమైన పాత్ర వుంది. అది బ్రహ్మజీ గారు చేశారు. ఈ పాత్రలో ఆయన్ని తప్పా మరొకరిని ఊహించలేను. ఇది ఆయన చాలా డిఫరెంట్ రోల్. అలాగే సుదర్శన్, సప్తగిరి, నరేన్, మైమ్ గోపి ఇలా పెద్ద స్టార్ కాస్ట్ వుంది. ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది” అన్నారు. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ జర్నీ ఒక అడ్వంచర్ లా జరిగింది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. హారిక ఎంటర్‌టైన్‌మెంట్ కి థాంక్స్. సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీ కి కృతజ్ఞతలు. బ్రహ్మాజీ తన పాత్రని చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా పట్ల చాలా ఎక్సయిటింగ్ వున్నాను. నవంబర్ 4న సినిమా విడుదల కాబోతుంది. నా మొదటి సినిమా ‘జాతిరత్నాలు’ ని ఆదరించినట్లే ఈ సినిమాకి కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమాని నవంబర్ 4నవిడుదల చేస్తున్నాం. సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా గొప్పగా తీశారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా గొప్పగా ఫెర్ ఫార్మ్ చేశారు. బ్రహ్మజీ గారు, సుదర్శన్, సప్తగిరి చాలా మంచి స్టార్ కాస్ట్ వుంది. ప్రేక్షకులు తప్పకుండా వినోదం పంచే సినిమా .. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్” అన్నారు.
బ్రహ్మజీ మాట్లాడుతూ.. శ్యామ్ సింగారాయ్ తీసిన వెంకట్ బోయనపల్లి గారు ఈ సినిమా తీసున్నారంటే ఈ కథ ఎంత బావుంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలా క్యాలిటీ వున్న సినిమా తీశారు. ఇందులో మనసుకు నచ్చిన పాత్ర చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు ప్రతి పదేళ్ళకు మంచి బ్రేక్ ఇచ్చే పాత్ర వస్తుంటుంది. అలాంటి బ్రేక్ వచ్చే పాత్రని ఇందులో చేశాను. మేర్లపాక గాంధీ అద్భుతంగా తీశారు. నవంబర్ 4న సినిమా విదుదలౌతుంది. ఖచ్చితంగా హిట్ సినిమా ఇది. మీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి’ అని కోరారు.